సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉగ్రవాద చర్యలకు ప్రణాళికలు రచిస్తున్న ఆరోపణలు ఫై, ఆధారాలు దొరకడంతో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ , దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. యూఏపీఏ చట్టం కింద కేంద్రం చర్యలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ , కర్ణాటక ప్రభుత్వాల నుంచి వచ్చిన సమాచారం , విన్నతుల మేరకే పీఎఫ్ఐ సంస్థ పై కేంద్రం ఈ నిషేధం విధించినట్లు తెలుస్తుంది. ఇటీవల . మూడు సార్లు జరిగిన దాడుల్లో… ఈ మూడు రాష్ట్రాల్లో కీలక ఆధారాలు లభ్యం అయ్యాయని, వాటి ఆధారంగా.. పీఎఫ్ఐను నిషేధించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేశామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
