సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం నంద్యాల జిల్లా, కొలిమిగుంట్ల గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదగా నూతనంగా ‘రాంకో సిమెంట్ ఫ్యాక్టరీ” ని ప్రారంభించారు. 1,790 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించిన ఈ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత వాసులకు కొత్తగా 1,045 మందికి ఉపాధి లభించిందని, పరోక్షంగా మరెందరికో ఉపాధి లభిస్తుందని రాష్ట్రము ఆర్ధిక అభివృద్ధిలో ఏడాది కి 20 లక్షల టన్నుల సిమెంటు ఉత్త్పతి సామర్థ్యం తో ఈ ప్యాక్టరీ పనిచేస్తూ ప్రత్యేక స్థానం సాధిస్తుందన్నారు. నిర్వాహకులను అభినందించారు. పరిశ్రమలస్థాపనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది అని దేశంలో పారిశ్రామిక వేత్తల అభిప్రాయం తీసుకొనే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3 వ ఏడాది ఏపీ నెంబర్ వన్ గా నిల్చిందని వ్యాఖ్యానించారు.
