సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అక్రమాలతో ఉక్రెయిన్ దేశం నెలలు తరబడి యుద్ధంతో విలవిలా లాడుతూ ప్రధాన రాజధాని నగరం ‘కీవ్’ మినహా చాలామటుకు ప్రాంతాలను, ముఖ్యంగా ఓడరేవులు ఉన్న మహానగరాలఫై పట్టుకోల్పోయిన విషయం ప్రపంచం గమనించింది. 3 దశాబ్దాల క్రితం రష్యా నుండి విడివడిన ఉక్రెయిన్లోని డొనెట్స్క్, లెహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ తదితర ఆక్రమిత ప్రాంతాలను తిరిగి అధికారికంగా విలీనం చేసుకునేందుకు పుతిన్ వ్యూహరచనతో రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నా యి. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు రష్యా అధికారులు ఇప్పటికే రిఫరెండం నిర్వహించడంతెలిసిందే. తాజగా ప్రకటించిన ఫలితాలలో..జపోరిజియాలో93 శాతం , ఖెర్స న్లో 87, లుహాన్స్ క్లో 98, డొనెట్స్ క్లో 99 శాతం ప్రజలు రష్యాలో విలీనానికి ఓటేసినట్టు వారుప్రకటిం చారు. ఇక విలీనం లాంఛనమే.. రష్యా సైన్యం తో బెదిరించి బలవంతం గా విలీనానికి ఒప్పిస్తున్నట్టు పాశ్చా త్య దేశాలు విమర్శించి ఊరుకొంటున్నాయి. మరి అన్నదమ్ముల గొడవలు బయటివాడు దూరితే ఇలానే ఉంటుంది అనుకొన్నారేమో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *