సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దసరా వేడుకల నేపథ్యంలో భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారు నేడు, గురువారం శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాక్షాతూ పరమ శివునికి ఆహారం అందిస్తున్న అన్నపూర్ణ దేవి దర్శనం కోసం భక్తులు విశేషంగా హాజరు అయ్యారు. శ్రీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన, ఆలయ ఆవరణలో చండి యాగాన్ని వేదపండితులు నిర్వహించారు. నేటి సాయంత్రం 4గంటలకు వేదికపై బుర్రకథ, తదుపరి రాత్రి 9 గంటలవరకు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గునుపూడి శ్రీ పంచారామ క్షేత్రం లో శ్రీ పార్వతి అమ్మవారికి నేడు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం జరిగింది. ఇక నేటి గురువారం సాయంత్రం ఆర్యావర్తక వైశ్య భవనంలో శ్రీ వాసవీ మాత అమ్మవారికి నవప్రసాదాలు నివేదన మరియు భక్తులకు ప్రసాద వితరణ నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *