సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ కేంద్ర మంత్రి , రెబల్ స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఆయన ప్రతిష్ట చిరస్థాయిగా ప్రజలకు గుర్తు ఉండేలా ఆం ధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన స్మృతి వనం ఏర్పా టు కోసం రెండెకరాల భూమి మంజూరు చేయాలని ( పేరు పాలెం బీచ్ దగ్గర) ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు మొగల్తూరులో సుమారు లక్షమంది అభిమానులు హాజరు అయిన వేళ, రాజవంశీకుడు అయిన కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు హాజరైన మంత్రులు రోజా, కారుమూరి నాగేశ్వరరావు, , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజుతో కలిసి రెబల్ స్టార్ వారసుడు ప్రభాస్ కు వారి కుటుంభ సబ్యులకు సీఎం జగన్ తరపున, ప్రభుత్వం తరపున సంఘీభావం ప్రకటించి అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భముగా ప్రభాస్ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞలు తెలిపారు. కృష్ణంరాజు సినీ-రాజకీయ రంగాల్లో రాణించారని,పలు సార్లు కేంద్ర మంత్రిగా దేశానికీ , మన తెలుగు రాష్ట్రాల ప్రజా సేవలో ముందున్నారని, ఆయన మృతి ఆయా రంగాలకు తీరని లోటని మం త్రి రోజా అన్నారు. ఆయన పేరిట మొగల్తూరు సముద్ర తీర ప్రాం తంలో స్మృ తి వనం ఏర్పాటు కోసం 2ఎకరాల స్థలం రాష్ట్ర టూరిజం తరపున కేటాయిస్తున్న ట్లు ఆమె ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *