సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రైతుల పాదయాత్ర నేడు, శుక్రవారం భీమవరం లో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భీమవరం పీపీ రోడ్ రహదారి గుండా తెలుగుదేశం పార్టీ నేతలు భారీ స్థాయిలో వారికీ స్వగతం పలుకుతూ ప్రతి 20 అడుగులకు ఫ్లెక్సీ బ్యానేర్స్ లు కట్టారు. ఇటీవల ప్రధాని మోడీ ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు 35 అడుగుల విగ్రహం వద్ద అమరావతి మహిళలు తమ డిమాండ్ కార్డ్స్ ప్రదర్శించారు. ఇక అరసవల్లి కి వెళుతున్న రైతునేతలు మీడియా తో మాట్లాడుతూ.. .. మన రాష్ట్ర రాజధాని అమరావతి ఒక్క చోటే ఉండాలని, అక్కడ రాజధాని కోసం భూములు ఇచ్చి త్యాగం చేశామని , సీఎం జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల సంకల్పం ను అరసవల్లి శ్రీ సూర్యనారాయణుడే మార్చాలని వేడుకొంటున్నామని అన్నారు. వారికీ స్థానిక టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐకి చెందిన ప్రముఖ నేతలు సంఘీభావం ప్రకటించారు. వర్షంలో అమరావతి రైతులు ప్రదర్శనగా పట్టణ ప్రజలకు అభివాదం చేస్తూ నేటి సాయంత్రం వీరవాసరం గ్రామం చేరుకొన్నారు. ఇక రేపు ఉదయం 9 గంటలకు వీరవాసరం లో బయలుదేరి పాలకొల్లు నియెజకవర్గం పూలపల్లి వరకు సాగి అక్కడ మద్యాహ్నాం భోజనం అనంతరం పాలకొల్లు టౌన్ తిరిగి రాత్రి పాలకొల్లు బై పాస్ రోడ్ లో గల కళ్యాణ మండపములో రాత్రి బస చేస్తారు అని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *