సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నేడు, శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. చంద్రబాబు డైరెక్టన్ లో అమరావతి రైతుల పాదయాత్ర అంటూ రాజకీయ స్వార్ధం , అక్కడ కేవలం 5 మండలాల లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రణంగా పెట్టి ప్రజల మధ్య విభేదాలకు చేస్తున్న ప్రహసనంగా కొట్టిపారేశారు. భీమవరం లో పాదయాత్ర చేస్తున్నపుడు స్థానిక టీడీపీ, జనసేన , లెఫ్ట్ పార్టీల నేతలు తప్ప నిజంగా ఇక్కడ ప్రాంత రైతులు, ప్రజలు ఎవ్వరు వారికీ మద్దతుగా పాల్గోలేదని , ప్రజలకు ట్రాఫిక్ కు ఇబ్బంది తప్ప వారి యాత్ర వల్ల ప్రయోజనం ఏమిటని? ప్రశ్నించారు. గతం నుండి తెలుగువారు ఒకే రాజధాని ఉంటె మిగతా తెలుగువారు రాజధానుల విషయంలో మోసపోతున్నారని.. చరిత్ర ఇదే చెబుతుందని, మొదట మద్రాస్ , తరువాత కర్నూల్, తరువాత హైదరాబాద్ , ఇప్పుడు అమరావతి …ఇలా మరోసారి మోసపోకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృధి చెందాలనే మంచి ఉద్దేశ్యంతో సీఎం జగన్ , 3 రాజధానులు ప్రకటించి అన్ని ప్రాంతాల అభివృద్ధి కి సమ ధర్మం పాటిస్తుంటే.. ఇది చూసి ఓర్వలేక కేవలం ఒక ప్రాంతం ప్రజలు బాగుకోసం , తన అవినీతి ఫలాల కోసం చంద్రబాబు చేస్తున్న కుట్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తనకు ఈ సారి జగన్ భీమవరం టికెట్ ఇవ్వరని జరుగుతున్నా ప్రచారం నిజం కాదని, మరల వైసిపి తరపున పోటీ చేస్తున్నాని, ప్రజల కోసం పనిచెయ్యడం తన బలహీనత అని, వదంతులు నిజమైతే ఇప్పటికే 2సార్లు మంత్రి ని అయ్యేవాడినని సెటైర్ వేశారు. గతంలో కూడా వదంతులు వచ్చిన, జగన్ భీమవరం పాదయాత్రలో రాష్ట్రంలో మొదటి టికెట్ ను తనకే ప్రకటించారని గుర్తు చేసారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *