సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం వీరవాసరం నుండి నేటి ఉదయం 10 గంటలకు అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో పాలకొల్లు వెళ్లే వాహనదారులకు, అటు పాలకొల్లు నుండి వీరవాసరం, భీమవరం కు ముఖ్యమైన పనులపై , ఆసుపత్రులకు వచ్చే రోగులకు తీవ్ర ఇబ్బంది కలిగింది. 7 కిలో మీటర్లు పరిధిలో మధ్యాహ్నం 12న్నర గంటల వరకు వాహనాలు, బస్సులతో సహా నిలిచిపోవడం జరిగింది. (ఇది ప్రత్యక్ష అనుభవం ) వారి ఆశయం వారికీ గొప్పదే కావచ్చు.. వారి పోరాటంలో ట్రాఫిక్ కు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఒకప్రక్కగా వెళ్లాలన్న సృహ లేకపోవడం, స్వామివారి రధం తో పాటు పాదయాత్ర లో వారు ట్రాక్టర్లు, కవరేజ్ వ్యానులు వాడటం, కళాకారుల ప్రదర్శనలు, తాడిచెట్లు ఎక్కి జెండాలతో పదర్శనాల కోసం తరచూ నిలిచిపోవడం .. పోలవరం కట్టలేని వాడు.. 3 రాజధానులు కడతాడంటా ?అంటూ ధర్నాలు తలపిస్తూ నినాదాలు చెయ్యడం కోసం ఆగిపోవడం.. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు సహనంతో పాదయాత్ర చేస్తున్నవారిని బ్రతిమాలాడుతున్న అందరు ఒకేసారి రోడ్డును మూసివేసి నడవడం తో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర అసహనానికి గురి అయ్యారు. అసలే లంకలకోడేరు సన్నటి మలుపు దగ్గరైతే మరి దారుణం. అక్కడ కారు కాదు .. ద్విచక్ర వాహనాలు దాటాలన్న అర్ధగంట పైగా సమయం పట్టింది.ఇక 11న్నర కు వర్షం కూడా ప్రారంభం అయ్యింది. ఇక చుడండి ట్రాఫిక్ లో చిక్కుకు పోయిన ద్విచక్ర వాహనదారుల పాట్లు ?ఒకరకంగా వారితో పాటు వాహనదారులను కూడా యాత్రలో భాగస్వాములను చేసీసారు. ఈ ట్రాఫిక్ సమస్యల నివృతి కి రాజకీయాలకు అతీతంగా అందరు ఆలోచించాలి.
