సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి మండలదీక్షా మాలాధారణ” 09-10-2022 రేపటి ఆదివారం నుండి ది.19-11-2022శనివారం వరకు 41 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీ అమ్మవారి దేవాలయంలో రేపు ఆదివారం వేదమంత్రాల నడుమ తెల్లవారుజామున 04:30 ని॥లకు కలశస్థాపనతో మండల దీక్షా ప్రారంభం అవుతుంది. భక్తులు అమ్మవారికి దీక్షా మాలా సమర్పణ తో మండల దీక్ష ప్రారంభంఅవుతుంది. 21రోజుల అర్ధమండల దీక్షా చేసేవారికి ఈ నెల 29వ తేదీ శనివారం దేవాలయంలో ఉదయం 05:00గం. లకుమాలధారణ చేయిస్తారు. వచ్చే సెప్టెంబర్ 8వతేది మంగళవారం పాద మండల దీక్ష ప్రారంభిస్తారు. 41వ రోజు అనగా ది.18-11-22న శుక్రవారం కావున ది. 19-11-22న శనివారం దీక్షా విరమణ మహా పూర్ణాహుతి చేయవలెను. దీక్షా విరమణ ది. 19-11-2022న శనివారం అమ్మవారికి మాలా విసర్జన, భక్తులకు ఇరుముడి కట్టించుట, దీక్షా విరమణ మహాపూర్ణాహుతి ఉదయం గం. 08:30 ని॥లకు. అమ్మవారికి నెయ్యి అభిషేకం నిర్వహిస్తామని కాబ్బటి అమ్మవారి భక్తులు ఈ అవకాశాన్ని సదివినియోగం చేసుకోవాలని దేవాలయ సహాయ కమిషనర్, యర్రంశెట్టి భద్రజీ తెలిపారు.
