సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మూగ, సన్న జీవాలకు పూర్తి స్థాయిలో బీమా కల్పించే లక్ష్యంతో వైఎస్సా ర్ పశు బీమాపథకాన్ని ఈ అక్టోబర్ నేలాఖరులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి తెస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి పాడి పశువుతో పాటు మూగ జీవాలు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్లకు కూడా బీమా కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులు 20శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా 80 శాతం ప్రీమియం ప్రభుత్వం భరిస్తోంది. సన్న జీవాలుకు, పశువులకు విపత్తులు, కరువు కాటకాలు, రోడ్డు, రైలు ప్రమాదాలు, విద్యుద్ఘాతాలతో ఏటా వేలాది మూగ, సన్న జీవాలు మృ త్యు వాతపడుతున్నా యి. ఇలాంటి పరిస్థితుల్లోవీటిని కుటుంభ పోషణ కోసం పెంచుకొనే వాటి యజమానులును ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వైఎస్సార్ పశు బీమాపథకం కింద నాటు ఆవులు, గేదెలకు రూ.15 వేలు, మేలు జాతి గేదెలు, ఆవులకు రూ.30 వేల చొప్పున, సన్న జీవాలకు ఒక్కో దానికి రూ.6 వేలు చొప్పున పరిహారం ఇస్తారు. ఏడాదిలో ఒక రైతుకు గరిష్టం గా ఐదు పశువులకు మాత్రమే బీమా వర్తిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *