సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పంచాయతీలు నాశనమౌతున్నాయని విమర్శించారు. జగన్ సర్కార్ దారి మళ్లించిన 14, 15 ఆర్థిక సంఘం నిధులు రూ.8,700 కోట్లు తిరిగి పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. 2014 తర్వాత టీడీపీ హయాంలో దాదాపు రూ.36 వేల కోట్ల 14వ ఆర్థిక సంఘ నిధులు, ఉపాధి హామీ నిధులు పంచాయతీలకే ఇచ్చామని, వాటి ద్వారానే సర్పంచ్‌లు గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారని చంద్రబాబు అన్నారు. మా పాలనలో గ్రామాల్లో సర్పంచ్‌ల గౌరవాన్ని పెంచామని అయితే, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం సర్పంచ్‌లను బిచ్చగాళ్లుగా చూస్తున్న వైఖరి దారుణమన్నారు. హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్‌లపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని జగన్ సర్కార్ ను చంద్రబాబు డిమాండ్ చేసారు.
