సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల భీమవరం పట్టణ పరిధిలో వరుసగా పలు దొంగతనాలు దోపిడీలకు పాల్పడిన దొంగల ముఠాను ఎట్టకేలకు 2 టౌన్ పోలీసులు పట్టుకున్నారు.( ఇటీవల భారీ దొంగతనాలు 2 టౌన్ లో ఎక్కువ జరుగుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 2 టౌన్ పోలీసులతో ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించిన విషయం విదితమే..) భీమవరంలో తాజగా పోలీసులకు చిక్కిన ముఠా నిందితుల వివరాలు ను 2 టౌన్ సీఐ కృ ష్ణకుమార్, ఎస్సై లు అప్పా రావు, రాం బాబులు మీడియా సమావేశంలో వివరించారు. ఈ ముఠా సభ్యులు ఆలయాల్లో హుండీలు, ఆభరణాలు, ఒంటరిగా ఉన్న వారి నుంచి డబ్బు, సెల్ ఫోన్లు బెదిరించి దొంగిలించడం, పలు ప్రాంతాల్లో మోటారు బైకులను అపహరించడం జరిగింది. దీనితో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు యు.రవిప్రకాశ్, అదనపు ఎస్పీ ఏటీవీ రవికుమార్ ఆధ్వ ర్యంలో పోలీసు బృందాలు గస్తీని పెంచిన క్రమంలో.. స్థానిక గొల్లవాని తిప్పా రోడ్డులో రాత్రివేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముఠా సభ్యులను గుర్తించి వెంటాడి పట్టుకోనట్లు తెలిపారు.ముఠా వద్ద నుండి కత్తి, బ్లేడులు స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. పట్టుబడ్డ ముఠా సభ్యులంతా స్థానిక పరిసర ప్రాంతాలకు చెందినవారేనని, 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు యువకులేనని , వీరంతా వ్యసనాలకు బానిసలై ముఠాగా ఏర్పడి డబ్బుకోసం చోరీలకు పాల్ప డుతున్నారని సీఐ కృష్ణకుమార్ చెప్పారు. పోలీస్ల కు దొరికిన ముఠా యువకుల వివరాలు ప్రకారం.. భీమవరంలో చినమావుళ్లమ్మ గుడి వీధికి చెందిన కోతాడి దివ్య మనోహర్, బీసీ కాలనీ వాసి గేదెల నాని, కొవ్వా డ పుం తకు చెం దిన నైనపు సాయిశ్రీరామ్,బలుసుమూడి చర్చి వెనుక వీధిలో నివాసం ఉంటున్న మామిడి దుర్గారావు(గుండు), దోనాద్రి జయవెంకట వంశీ, రాయలం గ్రామస్థుడు చాబత్తుల చం ద్రకిరణ్, కాళ్ల మండలం కోపల్లెకు చెం దిన దాసరి తులసీరామ్, పెద్దమిరం కు చెందిన ప్రకాష్ , చినఅమిరం చెందిన తెనాలి దావీదులు ఉన్న ట్లు సీఐ కృష్ణ మోహన్ తెలిపారు. వీరిపై జిల్లాలో పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో దొంగతనాలు, బైకుల చోరీలు, దేవాలయాల్లో నగలు చోరీలు , గంజాయి రవాణా వంటి పలు ఆరోపణలలో కేసులు ఉన్నాయని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *