సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజకీయలలో అత్యంత ప్రముఖుడు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,యూపీ మాజీ సీఎం, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. అనార్యోగ్యంతో గత ఆగస్టు 22వతేదీ నుండి గురుగ్రామ్ నగరంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ములాయం నేడు సోమవారం ఉదయం 8.30 గంటలకు మరణించారు. 82 ఏళ్ల వయసున్న ములాయం సింగ్ యాదవ్ దేశంలో అతిపెద్దరాష్ట్రం యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు. కేంద్ర రక్షణశాఖ మంత్రిగానూ ఈయన పనిచేశారు. ములాయం1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ములాయంసింగ్ యాదవ్ ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. ములాయం మొదటి భార్య మాలతీదేవి కుమారుడు అఖిలేష్‌యాదవ్.రెండో భార్య సాధన కుమారుడు ప్రతీక్‌యాదవ్ లోహియా. సీనియర్ నేత దివంగత రాజ్‌నారాయణ్ స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారు. ములాయం మృతికి దేశ ప్రధాని, మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కెసిఆర్, ప్రతిపక్ష నేత చంద్రబాబు తమ తీవ్ర సంతాప సందేశాలు పంపారు.
