సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఆకివీడు పట్టణం శివారు అజ్జమూరు గ్రామా పరిధిలో వద్ద ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు నర్సాపురం నుంచి బయలుదేరి భీమవరం దాటి ఏలూరు వెళుతుండగా ఏకంగా బస్సుకు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీనితో వెంటనే జరగబోతున్న దారుణం గమనించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును జాగ్రత్తగా నిలిపివేశారు. ఆ భారీ కుదుపు తో ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుని దేవుడులాంటి డ్రైవర్ ను అభినందించారు. అయితే డిపో లో బస్సులు పూర్తీ సర్వీస్ లు చేయించేటప్పుడు మెకానిక్ లు వాటి సామర్ధ్యం ముందే పసిగట్టవల్సి ఉంది.
