సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయనగరం జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవాలు వెలది మంది భక్తుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు, మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం తరపున మం త్రి కొట్టు సత్య నారాయణ పైడి తల్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర కి పరిపాలన రాజధాని వచ్చేలా చెయ్యాలని అమ్మ వారిని కోరాను. గతంలో రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని శివ రామకృష్ణన్ కమిటీ చెప్పింది. మరోసారి హైదరాబాద్ లాగా ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే నష్టం జరుగుతుంది అని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక చంద్రబాబు అమరావతిలో తన రియల్ ఎస్టేట్ మాఫియా బాగు కోసం ఫేక్ రైతుల తో ఫేక్ పాదయాత్ర చేయిస్తున్నా డు. ఈ యాత్ర చేస్తున్నవారు టీడీపీ వారి పెయిడ్ వర్కర్స్ అని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *