సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి, వై ఎస్ జగన్ ఈ నెల 14న నరసాపురం రానున్న నేపథ్యంలో ఏర్పట్లను శరవేగంగా పూర్తీ చెయ్యాలని పూర్తి చేయాలని, వరుస వర్షాలతో వస్తున్నా ఇబ్బందులను అధిగమించి కష్టపడాలని కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. నరసాపురం పట్టణ పరిధిలోని 25వ వార్డు వీవర్సుకాలనీ ప్రాంతంలో ముఖ్యమంత్రి బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని చినమామిడిపల్లి లేఅవుట్లో, సీఎం కు స్వగతం పలికే హెలిప్యాడ్ నిర్మాణ పనులను, రైల్వే స్టేషన్ కు వెళ్లే మత్స్య పురి వం తెన సమీపంలో వాటర్ గ్రిడ్ ప్రారంభోత్సవానికి సంబందించిన పైలాన్ పనులను ఆమె స్థానిక ఎమ్మెల్యే ప్రసాదరాజుతో కలసి పరిశీలించారు. 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి పనులపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఛార్జి తీసుకొన్న నరసాపురం సబ్ కలెక్టర్ ఎం .సూర్యతేజ, తహశీల్దార్ ఎస్.ఎం .ఫాజిల్, మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
