సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని జగన్ సర్కార్ ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విటర్ లో నేడు, మంగళవారం తాజగా మరోసారి విమర్శలు సంధించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర’గా ప్రకటించాలని పవన్ ఎద్దేవా చేశారు. ‘‘వికేంద్రీకరణే సర్వతోముఖాభివృద్ధికి మంత్రం అనుకుంటే మూడు రాజధానులే ఎందుకు? 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి.. 25 రాజధానులను ఏర్పాటు చేయండి. చట్టం,న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి మీరు అతీతం అన్నట్లుగా భావిస్తుంటారు.. అలాగే ప్రవర్తిస్తుంటారు కదా! ప్రజల అభిప్రాయం తో సంబంధం లేదు కదా మీకు! ఏమాత్రం సంకోచించకండి.. రాష్ట్రంలో వైకాపా రాజ్యాంగాన్ని అమలు చేయండి!’’ అంటూ వెటకారం చేస్తూ ట్వీట్ చేశారు.
