సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల తెలుగు దేశం పార్టీపై విమర్శల జోరు తగ్గించిన మాజీ మంత్రి కొడాలి నాని తాజగా నేడు, మంగళవారం మళ్లీ నోటికి పని చెప్పారు. గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండో రోజు కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చరిత్రలో అస్తమించిన వ్యవస్థ టీడీపీ అని, జగన్ మోహన్ రెడ్డి ప్రభంజనానికి ఆ పార్టీ ప్రముఖులు అంతా మట్టికరిచారని, ఇప్పుడు ఆయనను విమర్శిస్తున్నవారంతా పోటుగాళ్ళు కాదని మండిపడ్డారు. త్వరలో నారా లోకేష్ కు పార్టీని పూర్తిగా అప్పచెప్పాలన్నదే చంద్రబాబు లక్ష్యం అన్నారు. కానీ ఆ పార్టీ అభిమానులు.. చాలామంది నేతలు మాత్రం.. అందుకు వ్యతిరేకిస్తున్నారని,వారంతా జూనియర్ ఎన్టీఆర్ పగ్గాలు చేపట్టాలని కోరుకుంటున్నారని.. అందుకే ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడే.. అమరావతి రైతుల పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారన్నారని ఆరోపించారు. అది అమరావతి రైతుల యాత్ర కాదని , ఒక కుల యాత్ర అని, అందులో పాల్గొంటున్న టీడీపీ నేతలు మాగంటి బాబు, చింతమనేని తో సహా అందరు ఒక కులానికి చెందినవారేనని, సుమారు 200 నుండి 300 అమాయక రైతులకు రోజుకు 2వేలు చప్పున ఇచ్చి చేయిస్తున్న పేక్ పాదయాత్ర .. దానికి రోజు పెద్ద భూకంపం వచ్చేసినట్లు గా కవర్ చేస్తూన్నా మీడియా పేపర్స్, ఛానెల్స్ కూడా అదే కులానికి చెందినవారివి కావడం అందరికి తెలిసిందేనని పేర్లు ఉదహరించారు. వారందరికీ అమరావతిలో భారీ స్థాయి భూములు ఉన్నాయని, ఇటీవల అదే కులంవారు తొడలు కూడా కొడుతూ వైసిపి వారిని రెచ్చగొడుతున్నారని, తొడలు కొట్టుకొంటే పొడి తప్ప ఏమి రాలదు .. ఎవడి తొడలుకు వాడే ఇంటికి వెళ్లి కొబ్బరినూనె రాసుకోవాలని ఎద్దేవా చేసారు కోడలి నాని , అయినా కేవలం 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని కోడాలి నాని ప్రశ్నించారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఎకరం 30 లక్షలు ఉన్న అమరావతి భూములు 10 కోట్ల రూపాయలకు పెరిగాయన్నారు.
