సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో మంత్రి దాడిశెట్టి రాజా నేడు, బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉత్తరాంద్ర ప్రజలలో ఉద్రిక్తలు రెచ్చగొడుతూ చంద్రబాబు చేస్తున్న అమరావతి రైతుల పేక్ పాదయాత్ర ను ప్రజలు వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర ప్రజల ప్రజాగర్జన నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో ప్రజలను మభ్య పెడుతూ వారి దృష్టిని డైవర్షన్ చెయ్యడానికి అదే రోజు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్ర అంటూ బహిరంగ సభకు సిద్ధం అవుతున్నాడని విమర్శించారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తూ పాదయాత్ర చేసే బదులు అమరావతికి మద్దతుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే లకు రాజీనామా చేసే దమ్ముందా? ఉపఎన్నికలలో నిలబడి గెలిస్తే ప్రజలు మద్దతు ఉన్నట్లే కదా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరంతరం వర్షాలు కురవడం తో పాడయిన రోడ్లను బాగు చేసేందుకు చర్యలు చేపట్టాము. రోడ్లు వేయడం అనేది నిరం తర ప్రక్రియ. వర్షాకాలం తగ్గిన వెంటనే రోడ్లు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశిం చారు. రోడ్ల మరమ్మ తుల కోసం సీఎం వైఎస్ జగన్ రూ. 1500 కోట్లు కేటాయించారు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *