సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం, తోకతిప్ప గ్రామంలో నేడు, బుధవారం “గడపగడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ,ఇంకా ఏమైనా సమస్యలు వున్నాయా? అని అడుగుతూ ఉత్సహ పూరిత వాతావరణంలో ప్రజల ను కలుస్తున్నారు. గ్రామంలో ఒకచోట చేరిన వృద్దులను సీఎం జగన్ ప్రభుత్వం పంపుతున్న పింఛనులు ప్రతి నెల 1వ తేదీ ఉదయానికల్లా వలంటీర్ల ద్వారా అందుతున్నాయా ? అని ఆయన ప్రశించగా, వారు గతంలో ఎప్పుడు ఇటువంటి రోజు వస్తుందని, ఊహించలేదని,గతంలో వందల రూపాయల పింఛన్ కే ఆఫీసుల చుట్టూ తిరిగేవారమని, ఇప్పుడు ఆ శ్రమ లేదని సక్రమంగా పింఛన్ అందుతుందని, అనారోగ్యం వస్తే ఆరోగ్యశ్రీ ఉందని, వచ్చే జనవరి నుండి 2500 నుండి 2750 కి పింఛను పెంచుతున్నారని తెలిసిందని సంతృప్తి వ్యక్తం చేసారు. ఒక వృద్ధుడు అయితే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ చేతిని ఆప్యాయంగా వదలకుండా పట్టుకోవడం ఫై చిత్రంలో చూడవచ్చు.. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు,ప్రజా ప్రతినిధులు వైసిపి నేతలు అభిమానులు, పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *