సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా గత 12 రోజులుగా ఏకబిగిగా కురుస్తున్న వర్షాలతో తడిసి ముద్ద అవుతుంది. నిన్న, నేడు బుధవారం వర్షం పడిన కాస్త ఎండ కనిపించింది. దీనితో ప్రజలు కాస్తా ఊపిరి పిలుచుకొన్నారో లేదో.. మరోసారి బంగాళాఖాతం లో వాయుగుండం ప్రభావంతో రానున్న 48 గంటల్లో రేపటి గురువారం, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో మరల భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే వర్షాలతో పంట పొలాలు, ఆక్వా చెరువులు నీటిలోనే నానుతున్నాయి. దోమలు పెరుగుతున్నాయి.. జ్వరాలతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. భీమవరం నడిబొడ్డున ప్రవహించే యనమదురు వంటి మురుగు కాల్వలు నిండుగా ప్రవహిస్తున్నాయి.
