సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక ఏమిటంటే.. ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు TTD ప్రకటించింది. ఈ నెల 25న ఉదయం 8.11 నుంచి రాత్రి .7.30 వరకు మూసివేసి సంప్రోక్షణ చేసిన తదుపరి తెరుస్తారు. వచ్చే నవంబర్ 8న ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 వరకు ఆలయం మూసి ఉంటుందని పేర్కొంది. ఈ గ్రహణాల రోజుల్లో బ్రేక్, ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని.. కేవలం సర్వదర్శన భక్తులకే స్వామి దర్శనం ఉంటుందని టిటిడి ప్రకటించింది.
