సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: . భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా64 లక్షల 75 వేల రూపాయలతో, రామాయణపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో “మనబడి నాడు నేడు” ఫేజ్ – 2 పనులకు శంకుస్థాపన చేశారు. తదుపరి 10 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం 31 లక్షల రూపాయలతో నిర్మించే సంతోషపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల “మనబడి నాడు-నేడు” ఫేజ్ – 2 పనులకు,40 లక్షల రూపాయలతో నిర్మించే కొమరాడ గొర్లమూడి విశాల సహకార పరపతి సంఘం గౌడౌన్ పర్సన్ ఫెసిలిటేషన్ సెంటర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. తదుపరి, ఇటీవల 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన దిరుసుమర్రు మెయిన్ రోడ్డు నుండి మోక పోతురాజు ఇంటి వరకు నిర్మించిన సీసీ రోడ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా అభివృద్ధికి అధిక ప్రాముఖ్యతను ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల బాలకృష్ణ,, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు ,జడ్పిటిసి కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరు మా ని ఏడుకొండలు, కొమరాడ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ మద్దాల వెంకట సత్య నరసింహారావు (రమణ) తాసిల్దారు వై రవికుమార్ ,పంచాయతీరాజ్ డిఇ స్వామి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *