సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం సమీపంలోని పాలకోడేరు మండలం మొగల్లు గ్రామం దళితవాడలో గొంతేలమ్మ పండుగ ( అట్లతద్ది ) సందర్భంగా నేడు, గురువారం “నంది విగ్రహజాతర” భక్తి శ్రద్దలతో వైభవంగా నిర్వహించారు.ఈ జాతరలో పాల్గొన్న ఏపీ శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషనురాజు మాట్లాడుతూ.. మోగల్లులో ఎన్నో తరాలుగా వస్తున్న ఆచార,సాంప్రదాయలనుపాటిస్తున్న ఇక్కడి యువజనులు అభినందనీయులని అన్నారు. సాంప్రదాయ నంది విగ్రహ జాతర ప్రారంభానికి ముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. నంది విగ్రహం పల్లకిని పట్టి జాతరను ముందుకు నడిపించారు. అక్కడి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మండలి చైర్మన్ మోషేనురాజు పూలమాల వేసి అంజలి ఘటించారు. ఎంపిపి భూపతిరాజు చంటిరాజు, సర్పంచ్ మల్లిపూడి కృష్ణకుమార శ్రీనివాస్, ఎంపిటీసి లు కాటూరి శాంతకుమారి, పెన్మత్స వెంకట లక్ష్మీ, వార్డు మెంబర్ బలే చిట్టిబాబు, అంబేద్కర్ యూత్ నిర్వాహుకులు కోనాల ప్రకాష్, బేతాళ యేసు, చిగురుపాటి చంటి, మైలాబత్తుల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *