సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ( నిన్న మన సిగ్మా న్యూస్ లో గత రాత్రి వచ్చిన తాజా సమాచారాన్ని కొనసాగింపుగా ..) ఇటీవల ఆక్వా ఫీడ్ ధరలను ఇష్టారీతిన పెంచడం, సిండికేట్ క్రింద ఏర్పడి కొందరు ఎగుమతి దారుల ప్రమేయంతో రొయ్య ల కౌంట్ ధరలను తగ్గించడం పై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్య క్తం చేయడంతో.. ఆక్వా ఫీడ్ తయారీ కంపెనీలు, ప్రాసెసర్లు దిగి వచ్చా రు. పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను పూర్తిగా ఉపసం హరించుకోవడంతో పాటు రొయ్యల కౌంట్ ధరలను పెంచేందుకు అంగీకరిం చారు. గత గురువారం సాయంత్రం నుండి రాత్రి వరకు గురువారం మంగళగిరిలోని ఏపీఐఐసీభవనం లో జరిగిన ఆక్వా సాధికార కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు.. మంత్రులు పెద్దిరెడ్డి, మంత్రి, బొత్స సత్య నారాయణ, మంత్రి సీదిరి అప్ప లరాజు, ఎంపెడా వైస్ చైర్మ న్ వడ్డి రఘురాం, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కె.కన్న బాబు నేతృత్వంలో ఏర్పాటైన సాధికార కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకొన్నారు. రొయ్యల మేత ఫీడ్ టన్ను కి పెంచిన రూ.2,600 తిరిగి తగ్గించడానికి ఫీడ్ కంపెనీలు అంగీకరించాయి. అలాగే అన్ని రొయ్యల సగటు కౌంట్ ధరలు రూ.40 నుంచి రూ.55 వరకు పెంపు ఎగుమతి దారులతో ఒప్పందం కుదిరింది. ఈ నెల 17 నుంచి దీనిని అమలు చేస్తామని ప్రకటించారు. ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి నష్టం కలిగించే చర్య లను ఉపేక్షించబోమని మంత్రి అప్పలరాజు స్పష్టం చేశారు. రైతులతో చర్చించకుండా ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచినా, కౌంట్ ధరలు తగ్గించినా చర్యలు తప్పవని, ఇకపై ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే ధరలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *