సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ జన్మదినవేడుకలు నేడు, శుక్రవారం నియోజకపరిధిలో వాడవాడలా ఒక పండుగల ఆయన అభిమానులు, వైసిపి అభిమానులు నిర్వహిస్తున్నారు. ఇది దశాబ్దాలుగా గ్రంధి శ్రీనివాస్ అధికారంలో ఉన్న లేకపోయిన ఇదే తరహా వేడుకలు ఆయన అభిమానులు నిర్వహించడం పరిపాటిగా వస్తుంది. అయితే అసలు ట్విస్ట్ ఏమిటంటే..? ఆయన పుట్టినరోజు వేడుకలకు భీమవరంలో ఉండరు. వేడుకలకు దూరంగా ఉంటారు. (ఒకటి 2 సార్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అది కూడా పకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తన గ్రీటింగ్స్ ఖర్చు తో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వ సహాయ నిది సేకరించడం కోసం మాత్రమే.. ).. అయినప్పటికీ పట్టణం అంత ఆయనకు ఫ్లెక్సీలు , బ్యానేర్స్ హడావిడి , దేవాలయాలలో ఆయన పేరు ప్రత్యేక పూజలు సర్వసాధారణం. ఇక నేడు, శుక్రవారం కూడా ఇదే తరహాలో నియోజకవర్గం సందడిగా ఉంది. శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం, శ్రీ పంచారామ క్షేత్రంలో పాటు పలు దేవాలయాల్లో ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో గ్రంధి శ్రీనివాస్ కు ఆయురారోగ్యాలు కోసం, ప్రజలకు మంచి పాలనా కోసం పూజలు, ఉచితంగా ప్రసాద వితరణలు జరిగాయి. వీరమ్మ పార్క్ సెంటర్ లో. అయన కుమారుడు గ్రంధి రవితేజ చేతుల మీదుగా పేదలకు అన్నసమారాధన, వస్త్ర దానం నిర్వహించారు. ఇంకా వైసిపి నేతలు పలు సామజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
