సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమలలో ఒక 4నెలల పసివాడిని కాకినాడకు చెందిన తల్లి తండ్రులు అమ్మకానికి పెట్టిన దారుణఘటన, ఆ బాబును కొనుగోలు చెయ్యడానికి భీమవరం నుండి వచ్చిన వ్యక్తి బేరం కుదరక చేసిన గొడవతో రచ్చ రచ్చ జరిగింది. విషయంలోకి వెళితే.. కాకినాడకు చెందిన కేశినేని వసంత (20)కు తల్లిదండ్రులు లేరు. ఆమె రాజమండ్రిలో బైక్ షోరూం లో పనిచేస్తోంది. ఆమెకు రాజమండ్రిలోనే ఒక ల్యా బ్లో టెక్నీ షియన్గా పనిచేస్తున్న పి.రారాజు(25)తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో వివాహం చేసుకొని 15 నెలలు మాత్రమే అయ్యింది. ఇంతలోనే . భార్యా భర్తలిద్దరూ తరచూ గొడవలు పడుతు విడిపోవాలని నిర్ణయించుకున్నా రు. తమకు అడ్డుగా ఉన్న నాలుగు నెలల వయసు గల చిన్నారి పసికందును అమ్మేసి, వచ్చిన డబ్బును పంచుకోవాలని భావించారు. దీనితో కుమారుడిని తీసుకుని రారాజు, వసంత, రారాజు తండ్రి ప్రసాద్ తో కలసి 25 రోజుల కిందట ద్వారకా తిరుమలకు చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ ఒక వ్యక్తి ద్వారా భీమవరానికి చెందిన వృద్ధుడికి బాబును అమ్మకానికి పెట్టారు. పిల్లాడి కోసం కొండపైన శ్రీనివాసా నిలయం కాటేజీ ప్రాంతానికి చేరుకున్న వృద్ధుడిని రూ.10 లక్షలు ఇవ్వా లని ప్రసాద్ డిమాండ్ చేసాడు. తాను అంత డబ్బు లు వృద్ధుడు అనడంలో కనీసం రూ.2లక్షలు ఇస్తే బాబును ఇస్తామని రారాజు చెప్పాడు. దీంతో వృద్దుడుకి రారాజు, అతని తండ్రికి మధ్య గొడవ జరిగింది. దీనితో చుట్టుపక్కల భక్తులు అక్కడికి చేరుకుని వారిని నిలదీశారు. దీంతో బాలుడి కోసం వచ్చిన భీమవరం వృద్ధుడు నెమ్మదిగా అక్క డి నుంచి జారుకున్నా డు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బిడ్డతోపాటు రారాజు, వసంత, ప్రసాద్ ను పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ ప్రారంభించారు. ( పైచిత్రంలో పోలీస్ బైకు ఎక్కినా వ్యక్తి ప్రసాద్.. వెనక నడుస్తున్న వ్యక్తి రారాజు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *