సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లోభారీ వర్షాలు ఇప్పటిలో వదిలేలా లేవు. ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తా ఆంధ్రలో ఎడతెరిపిలేని వర్షాల కారణం గా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండి పోయాయి. గోదావరి జిల్లాల్లో గత 3 వారాలుగా వర్షం రోజువారీ వదిలిందే లేదు. ఇక భీమవరం లో కూడా గత 3 వారాలుగా ఇక తగ్గిదేలే.. అన్న తీరున వర్షాలు ఉండటంతో ప్రజలు కూడా వర్షంలో దినచర్యల కు అలవాటు పడిపోయారు. నిన్న,నేడు శనివారం కూడా భారీ వర్షం కురుస్తానే ఉంది. కాగా మరోసారి ఈ నెల 20న బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనుంది. ఈ అల్ప పీడనం బలపడి తీవ్ర వాయుగుండం గా మారి ఏపీ వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తాజగా ప్రకటించారు. దీంతో, రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి నదితో పాటు కృ ష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. ప్రకాశం బ్యారేజ్ కి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎడారిగా మారిపోతుందనుకొన్న అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఆఖరికి పెన్నా నదికి కూడా వరదలు వచ్చి ఉదృతంగా ప్రవహించడంతో అక్కడి ప్రజలు కొన్ని ఇబ్బందులు ఉన్నవాగులు, చెరువులు కాలువలు నిండిపోవడంతో హర్షం ప్రకటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *