సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పద్మభూషన్ డా. బి. వి రాజు 102 వ జన్మదిన వేడుకలు”స్థానిక బి. వి రాజు కాలేజీ లో బి. వి రాజు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్బంగా NSS units 1&2 ఆధ్వర్యంలో NSS వాలంటీర్స్ రక్త దాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో 30 మంది వాలంటీర్స్ మరియు సిబ్బంది కలిసి రక్త దానం చేసారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.ఐ ఆర్ కే రాజు మాట్లాడుతూ.. దేశం గర్వించేలా.. , సిమెంటు,కెమికల్స్ రంగానికి, విద్యారంగానికి ఎంతో సేవలు చేసి, పేద ప్రజలకు అండగా నిలబడిన పద్మభూషన్, బి వి రాజు లాంటి మహానుభావుడు జన్మించిన రోజున.. NSS వాలంటీర్స్ రక్త దానం చేసి ఎంతో మందికి ప్రాణ దానం చేశారు అని రక్త దాతలను ప్రశంసించారు. అలాగే ఈ శిబిరన్ని నిర్వహించిన NSS కార్యకర్తలను, ASN రాజు బ్లడ్ బ్యాంక్ వారిని అభినందించారు.
