సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలకడానికి వచ్చిన జనసేన కార్యకర్తలకు, విశాఖ గర్జన తరువాత ఎయిర్ పోర్ట్ కు చేరుకొన్న మంత్రులకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన వైసిపి కార్యకర్తలు మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలు తమపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారని,తన కారు అద్దాలు ద్వంసం అయ్యాయని,ఈ ఘటనలో తమ వాళ్లకు గాయాలయ్యా యని మం త్రి రోజా సహాయకుడితోపాటు పలువురికి గాయాలయ్యా యి, అలాగే వైవీ సుబ్బా రెడ్డి, కారుపై కూడా దాడికి దిగారని , జనసేన కార్యకర్తల విధ్వం సం తో ఎయిర్ పోర్ట్ లోని ప్రయాణికులు భయభ్రాం తులకు గురయ్యా రు అని అన్నారు. .విశాఖ గర్జన కు వర్షంలో కూడా లక్షలాది ప్రజలు నుండి అపూర్వ స్వాందన రావడంతో ను ఆ వార్తలను పక్క దారి పట్టించేందుకే పవన్ కళ్యాణ్ నేడు, వైజాగ్ వచ్చి తాగుబోతులతో దాడులు జరిపిం చారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం లో ఇది కరెక్ట్ కాదని హెచ్చ రిం చారు. తమతో పెట్టుకుంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలోతిరగలేడని ధ్వజమెత్తారు. వైవీ సుబ్బా రెడ్డి, జోగి రమేష్లపై విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కల్యా ణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పవన్ పిచ్చివేషాలు వేస్తె చీరేస్తాం.. మీకు వందమంది ఉంటే.. మాకు పదివేల మంది ఉన్నారు జాగర్త అని హెచ్చరించారు.
