సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని రైతులకు 4వ విడతగా వై ఎస్ ఆర్ రైతు భరోసా నిధుల్ని నేడు, సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలో ఏర్పటు చేసిన బహిరంగ సభ నుండి సీఎం జగన్ కంప్యూ టర్ బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి 50.92 లక్షల మంది రైతన్న లకు రూ.2,096.04 కోట్ల నగదు విడుదల చేసారు. ఈ సందర్భముగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుం ది . ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నాంరైతులకు ఇంత తోడుగా ఉన్న రాష్ట్రం దేశంలో ఎక్క డా లేదు. రాష్ట్రం లో 68 శాతం మం ది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది.గత మూడు విడతల్లోప్రతి రైతుకు రూ. 13,500 సాయం అందించి అండగా ఉన్నాం. ఎక్కడా లం చాలు లేవు.. కులం, పార్టీ వివక్ష లేదు. ఇప్పటికే మేలో రూ. 7500 ఇచ్చాం . ఇప్పు డు రూ. 4 వేలు ఇస్తున్నాం. మూడున్న రేళ్లలో రైతు భరోసా కింద రూ.25, 971 కోట్ల మేర లబ్థి మొత్తం 50 లక్షల మంది ఖాతాల్లోనేరుగా డబ్బులు జమ చేశాం ఒక్కో కుటుం బానికి రూ. 51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం అన్నారు. ఇటీవల ఎల్లోమీడియాకు గర్వం పెరిగిపోయిం ది, ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్ను తున్నాయి. దత్తపుత్రుడు తో సహా గజదొంగల ముఠా మంచిని చెప్ప దు.. కుట్రలే చేస్తుంది. వీరికి ప్రజలే గట్టిగా బుద్ది చెప్పే సమయం వచ్చేసింది. మూడున్న రేళ్లలో రైతన్నల కోసం రూ. 1.33లక్షల కోట్లు ఖర్చు చేశాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *