సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనక దుర్గ మాత కు దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ప్రశాంతంగా ముగించిన నేపథ్యంలో నేడు, సోమవారం దుర్గగుడి ఈవో భ్రమరాంబ మీడియాతో మాట్లాడుతూ..ఇటీవల భవానీ దీక్షాపరులు గత రెండేళ్లలో పోల్చుకుంటే ఎక్కువ మంది వచ్చారన్నారు. ఈ ఏడాది దసరాకు రూ.16 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు . దసరా వేడుకలకు, ఏర్పాట్లకు రూ.10.5 కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. ఇక ఈనెల 25న ఉదయం 11 గంటలకు సూర్యగ్రహణ కారణంగా ఆలయాన్ని మూసివేస్తున్నామని తెలిపారు. 26న మహా నివేదన, హారతి అనంతరం ఆలయాన్ని తెరువనున్నట్లు ఈవో వెల్లడించారు. 26 నుంచి కార్తీక మాసం సందర్భంగా కార్తీకమాసం ఉత్సవాలు జరుగుతాయన్నారు. వచ్చే నేల 4 నుంచి 8 వరకు భవానీ దీక్షలు ప్రారంభం అవుతాయని… నవంబర్ 7న ఇంద్ర కీలాద్రిపై కోటి దీపోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. 8న చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేస్తామన్నారు. 24న అర్థ మండల దీక్షలు ప్రారంభం అవుతాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *