సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో నేడు, గురువారం జరిగిన రైతుల పత్రాల పంపిణీ కార్యక్రమం లోపాల్గొన్న సీఎం జగన్, బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఇటీవల దత్తపుత్రుడిచే బూతుల ప్రహసనం చేయించిన చంద్రబాబు, వారి ముసుగు తొలగిన కలయిక ప్రజలు అందరు చూసారు. ఇటువంటి వెన్ను పోటుదారులంతా నమ్మినవారికి, ప్రజలకు ఎవరికీ, ఎప్పుడు మంచి చేయలేదు. చేసేవారిని అడ్డుకొంటారు. ఇటీవల కొందరు చెప్పులు చూపిస్తూ దారుణమైన బూతులు మాట్లాడుతున్నారు. పైగా వీళ్ళు పార్టీ అధినేతలు.. కర్మ.. వీళ్ళే ఇలాఉంటే ఇక వారి కార్యకర్తలు దాడులు చూసి ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దారుణమైన బూతులు తిట్టడంలో వీధి రౌడీలను మించిపోయారు. అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేద్దామని మూడు రాజధానుల వల్ల అందరికీ మేలు జరుగుతుందని చెబితే.. కాదు మూడు పెళ్లిళ్ల నుండి 4 పెళ్లిళ్లు చేసుకొంటే మేలు జరుగుతుందని, అదికూడా భార్యలకు భరణాలు ఇచ్చేస్తే విడాకులు వచ్చేస్తాయని భరోసా ఇస్తున్నారు.. వీళ్లకు ఆడవాళ్లు అన్న , బాధ్యతలు, కుటుంబ విలువలు అన్న గౌరవం లేదు.. నాయకులుగా చెప్పుకుంటున్న వాళ్లు అలా మాట్లాడడం మొదలుపెడితే.. మన రాష్ట్రంలో ఆడవాళ్ల మానప్రాణాలు, అక్కా చెల్లెమ్మల జీవితాలు ఏం కావాలి?. ఇలాంటి వాళ్ళ మన మనకు దిశ దశ చూపిస్తారా? .. ఒక్క సారి ఆలోచించండి,, చంద్రబాబు దుష్టచతుష్టయం..దత్తపుత్రుడి కూటమి వారి దొంగ ప్రచారాలకు దూరంగా ఉండండి. ఒక్క జగన్ను కొట్టడానికి ఇంత మంది ఏకం కావడం ఆశ్చర్యం గా అనిపిస్తుందని.. మీ బిడ్డ మీద(తనను తాను ఉద్దేశిస్తూ సీఎం జగన్), ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తారట.. ఇది మంచికి.. మోసానికి జరుగుతున్న యుద్ధమని.. పేదవాడికి.. పెత్తందారుడికి మధ్య జరుగుతున్న యుద్ధమని అన్నారు. వీళ్ళను మీడియాను పట్టించుకోకండి.. మీ ఇంట్లో జగనన్న వల్ల ఎంత మేలు జరిగింది? అన్నది మాత్రమే ఆలోచించండి. అని సీఎం జగన్ పిలుపు నిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *