సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక ఆర్ ఆర్ డి ఎస్ కళాశాల లో నూతనంగా ప్రారంభించిన సైన్స్ కోర్సుల అభివృద్ధి కి ప్రముఖ ఫీడ్స్ వ్యాపారి సి హెఛ్ వి సుబ్బరాజు 50 వేల రూపాయలు విరాళాన్ని కళాశాల ప్రిన్సిపాల్, ప్రసున్న కు అందజేశారు. ఈ సందర్భముగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. దాత సహకారంతో విద్యార్థుల కోసం సైన్స్ ల్యాబ్ ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిదుతామని కృతజ్ఞలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
