సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త సమాచారం మేరకు..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన కస్టమ్స్ ఆపరేషన్లో నేడు, గురువారం ఒక్కరోజే రూ.11 కోట్లు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. 20 బృందాలుగా ఏర్పడి కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్ నిర్వహించారు. కొందరు స్మగ్లర్స్ ఆర్టీసీ బస్సులు, కార్లు, రైళ్లలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించారు. విశాఖ, నెల్లూరు, ఏలూరు, కాకినాడ, సూళ్లూరుపేట, చిలకలూరిపేటలో భారీగా బంగారం పట్టుబడింది. రూ.6.7 కోట్లు విలువైన 13.189 కిలోల బంగాన్ని సీజ్ చేశారు. బంగారంతో పాటు 4.24 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఏలూరులో కూడా బంగారం దొరకడంతో దీని మూలాలు పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు బంగారు వ్యాపారస్తులకు లింక్స్ ఉండే అవకాశం ఉంది..పూర్తీ వివరాలు తెలియవలసి ఉంది.
