సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పోలీసు అమరవీరుల సంస్మరణదినోత్సవం సందర్భంగా..విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేడు, శుక్రవారం ఉదయం నిర్వ హించిన వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. ఏపీ పోలీసుల తరపున గౌరవవందనం స్వీకరించారు సీఎం జగన్. అనంతరం ప్రసంగిస్తూ.. పోలీస్ అమర వీరులకు, త్యాగధనులైన పోలీసు కుటుంబాలకు ఏపీ ప్రజల తరపున, ప్రభుత్వం తరపున సెల్యూట్చేస్తున్న ట్లు ప్రకటించారు . గత సంవత్స ర కాలం లో ఏపీ నుంచి విధి నిర్వహణలో పదకొండు మంది పోలీసులు అమరులయ్యారని ఈ సందర్భంగా ప్రకటించారు.విధి నిర్వహణలో సమాజం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మనందరి సైనికులే పోలీసులని భరోసా ఇచ్చా రు.పోలీసులపై ఒత్తిడికి తగ్గించేందుకు.. పోలీస్ నియామకాల భర్తీ చేపట్టినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.పోలీస్ శాఖలో 6,511 పోస్టుల భర్తీతో పాటు.. హోం గార్డుల భర్తీలో రిజర్వేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలియజేశారు.తమ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థలో మార్పు లొచ్చాయన్న సీఎం జగన్. దిశా యాప్, దిశా పోలీస్ స్టేషన్లు అందులోభాగమేనని తెలియజేశారు. ఇప్పటిదాకా 1.33 కోట్ల మంది అక్కా చెల్లెమ్మలు దిశా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని, పోలీస్ శాఖలోనే 16వేల మంది మహిళా పోలీసులను నియమించామని ఆయన ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *