సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సూర్యగ్రహణం సందర్భంగా నేడు మంగళవారం రాష్ట్రంలోని ఆలయాలు మూతపడ్డాయి. ప్రధాన ఆలయాలతో పాటు ఉప ఆలయాలను కూడా అర్చకులు మూసివేశారు. తిరిగి రేపు ఉదయం ఆలయాల శుద్ధి, ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయాలు తెరుస్తారు. ఈ నేపథ్యంలో భీమవరంలో కూడా అన్ని దేవాలయాలు నేటి ఉదయం 10గంటలకు మూసివేసివేసారు. అయితే రేపటి బుధవారం నుండి పరమ శివునికి ప్రతీకరమైనదిగా భక్తులు భావించే పవిత్ర కార్తీక మాసం ప్రారంభం సందర్భంగ భీమవరం, గునుపూడి లో పవిత్ర పంచారామం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి దేవాలయాన్ని గ్రహణ సంప్రోక్షణ మరియు శుద్ధి చేసిన తరువాత బుధవారం ఉదయం 6 గంటలకు భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తామని ఆలయ ఇఓ ఎం అరుణ్ కుమార్ తెలిపారు. ఇక, పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం సూర్య గ్రహణం సందర్భంగా నేడు, ఉదయం 10గంటలకు మూసివేసిన కార్యక్రమం లో ఆలయ సహాయ కమిషనర్ యర్రంశెట్టి భద్రాజీ, ఆలయ ప్రధాన అర్చుకులు మద్దిరాల మల్లికార్జున శర్మ , ధర్మకర్త మండలి సభ్యులు ముత్యాల రామారావు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.. శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి పునర్దర్శనం రేపు బుధవారం ఉదయం 9గంటల నుండి ప్రారంభిస్తారు.
