సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో నేడు, మంగళవారం ఏర్పడిన పాక్షిక సూర్య గ్రహణం ను పలువురు ప్రజలు వీక్షించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సముద్ర తీరా ప్రాంతాలలో ప్రజలు ఆబాలగోపాలం చక్కగా గ్రహణాన్ని వీక్షించారు. భీమవరంకు సమీపంలోని పేరు పాలెం బీచ్ లో కూడా విశేషంగా ప్రజలు గ్రహణం పట్టువిడుపులు వీక్షించారు. సెల్ ఫోన్ లలో చిత్రీకరించారు. సాయం త్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటలకు ముగియడం స్వష్టంగా కనపడింది. వేదపండితుల అభిప్రాయం ప్రకారం ఆశ్వ యుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వా తి నక్షత్రం లో మొదలైన సూర్య గ్రహణం ముగిసింది. పండితుల అభిప్రాయం ప్రకారం రాశుల వారీగా ఈ పాక్షిక సూర్య గ్రహణం వల్ల సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. కన్య, మేషం ,కుంభం , మిథునం రాశుల వారికి మధ్యస్త ఫలితాలు ఉంటాయి. తుల, కర్కా టక, మీన, వృ శ్చి క రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయి అని భావిస్తున్నారు. అయితే సూర్య గ్రహణం సమయంలో తలస్నానం ఆచరించడం , సూర్య ఆరాధన చేసుకోవడం ,ధ్యానం చెయ్యడం , రాహు జపం , దుర్గాదేవి ఆరాధన వల్ల శుభఫలితాలుం టాయి అని వారి అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *