సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తీక మాసం మొదలు 2023 కొత్తఏడాది ప్రారంభం వరకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని విజయవాడ రైల్వే జంక్షన్ మీదుగా నవంబర్ 2వ తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ వరకు సుమారు 100 ప్రత్యే క రైళ్లు నడపనున్నట్లు విజయవాడ పశ్చి మ అధికారులు ప్రకటించారు. వీటిలో ముఖ్యంగా , హైదరాబాద్–తిరుపతి (07643) నవంబర్ 7నుంచి 28 వరకు ప్రతి సోమవారం, తిరుపతి–హైదరాబాద్ (07644) నవంబర్ 8 నుంచి 29 వరకు ప్రతి మంగళవారం ,విజయవాడ–నాగర్సోల్ ( షిరిడి) (07698) నవంబర్ 4 నుంచి 25 వరకు ప్రతి శుక్రవారం నాగర్సోల్ వైపు విజయవాడ నుంచి (07699) నవంబర్ 5నుంచి 26 వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు తెలిపారు.కాకినాడ టౌన్–లిం గం పల్లి (07141) నవంబర్ 2 నుంచి 30 వరకు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, లింగంపల్లి–కాకినాడ టౌన్ (07142) నవంబర్ 3 నుం చి డిసెం బర్ 1 వరకు ప్రతి మంగళ, గురు, శనివారాల్లోప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించారు. కాజీపేట–తిరుపతి (07091), తిరుపతి–కాజీపేట(07092) రైళ్లు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 27 వరకు ప్రతి మంగళవారం ,మచిలీపట్నం –సికింద్రాబాద్ (07185), సికింద్రాబాద్–మచిలీపట్నం (07186) రైళ్లు నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రతి ఆదివారం నడుస్తాయని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *