సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, బుధవారం భీమవరం మండలంలోని ఎల్ వి ఎన్ పురం గ్రామంలో ఇంటింటికి తిరిగి గత మూడు సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను, అదే మాదిరిగా ప్రతి ఇంటికి అందిన సంక్షేమ పథకాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎక్కడ పర్యటించిన సీఎం జగన్ అందిస్తున్న సుపరిపాలన పట్ల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. ఈ ఎల్ వి ఎన్ పురం గ్రామానికి సంబంధించి అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని, రానున్న రోజుల్లో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు పాటు కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం దెబ్బతిందని, అయినప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీ పడలేదని అన్నారు.అభివృద్ధి పరంగా భీమవరం నియోజకవర్గాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యనమదుర్రు డ్రైన్ పై ఇప్పటివరకు నిరుపయోగంగా ఉన్న మూడు వంతెనలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి రూ 36 కోట్ల నిధులను మంజూరు చేయించడం జరిగిందని, త్వరలోనే టెండర్ ప్రక్రియ ముగిసి పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే తా నాగబాబు,,ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి సభ్యులు కాండ్రేగుల నరసింహారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరు మాని ఏడుకొండలు, తాసిల్దార్ వై రవికుమార్, పలువురు సర్పంచులు తదితరులుపాల్గొన్నారు.( ఫై దృశ్యం ఎల్ వి ఎన్ పురం లో)
