సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరంలో స్థానిక మారుతి సెంటర్ లో వేంచేసిన శ్రీ దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో 41వ వార్షికోత్సవాలు ఈ నెల 16వ తేదీ గురువారం నుండి ప్రారంభిస్తున్నారు. ఈ నెల 20వ తేదీవరకు ఈ వేడుకలు జరుగుతాయి. 16వ తేదీ ఉదయం 5 గంటలకు కలశ స్థాపన పూజ కార్యక్రమం తో ఉచ్వాలు ప్రారంభమౌతాయి. ఉదయం 9గంటలకు శ్రీ ఆంజనేయ స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు 108 బిందెల ఆవుపాలతో, పండ్ల రసాలతో శ్రీ స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. తరువాత 1300 అరటిపండ్ల పూజ, సింధురాపూజ రాత్రి 7 గంటలకు పుష్ప అలంకరణలు నిర్వహిస్తారు. 17, 18, 19,20 తేదీలలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు , లైటింగ్ అలంకరణలు ఉంటాయి
