సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో నేడు, గురువారం జెన్కో మూడో విద్యుత్తు ఉత్పత్తి యూనిట్ను సీఎం జగన్ ప్రారంభించారు. తదుపరి కృష్ణపట్నం పోర్టు పరిధిలో చేపల వేటకు అనువుగా రూ.25 కోట్ల వ్య యంతో ఫిషింగ్ జెట్టి నిర్మా ణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ… ‘‘ఆనాడు ఉమ్మడి రాష్ట్రం లో మన ప్రియతమ ముఖ్య మంత్రి వైఎస్సా ర్ 2008లో ఈ విద్యుత్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఇప్పడు నా హయాంలో పూర్తీ చేశాను. ఇక రాష్ట్ర విద్యు త్ ఉత్ప త్తిలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యా ధునిక సాంకేతికపరిజ్ఞానంతో నిర్మించిన జెన్కోమూడోయూనిట్ను జాతికి అం కితమిస్తున్ననన్నారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాం .ఈ ప్రాజెక్ట్కు భూములిచ్చిన రైతులకు ధన్య వాదాలు. 326 రైతు కుటుంబాలకు ఇప్పటికే ఉద్యో గాలు ఇచ్చాం . మరో 150 కుటుం బాలకు నవంబర్లో ఉద్యో గాలు ఇస్తామని’’ సీఎం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *