సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రష్యా అధ్య క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసల వర్షం కురిపిం చారు. మాస్కో కు చెందిన వాల్డై డిస్క షన్ క్లబ్ వార్షిక ప్రసంగం లో పుతిన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.‘మోదీ నాయత్వం లో భారత్లో అనేక మంచి పనులు జరిగాయి. ఆయన అసలైన దేశ భక్తుడు. మోదీ ‘మేకిన్ ఇండియా’ ఆలోచన ఆర్థికంగా, నైతికం గా చాలా కీలకమైంది. ఇక భవిష్యత్తు భారతదేశానిదే.. . ప్రపం చలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినందుకు భారత్ గర్వించాలి.’ అని పేర్కొ న్నా రు. బ్రిటిష్ వలస పాలనలో ఎంత దోపిడీ జరిగిన ప్రస్తుతం తన స్వశక్తి తో సుమారు 150 కోట్ల జనాభా ఉన్న భారత్ అభివృ ద్ధి చెందిన దేశంగా ఎదగడం అద్భుతమని, అందుకే అన్ని దేశాలవారు భారత్ ను గౌరవిస్తారని రష్యా అధ్య క్షుడు అన్నారు. భారత్, రష్యా మధ్య ప్రత్యే క అనుబంధం ఉందని, ఎప్పుడూ క్లిష్ట పరిస్థితులు రాలేదని.. ఎల్లప్పు డూ ఒకరికొకరం మద్దతుగా నిలిచామని తెలిపారు. ప్రస్తుతం అదే కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులోనూ ఇదే బంధం కొనసాగుతోందని పేర్కొన్నారు. భారత్ తో రష్యాకు వ్య వసాయంలో వ్యాపారం దాదాపు రెండితలు పెరిగిందని పుతిన్ వ్యా ఖ్యానించారు. మరోవైపు . ప్రపం చం పై పెత్తనం కోసం పశ్చి మ దేశాలు చేస్తున్న క్రూరమైన క్రీడ(డర్టీ గేమ్)ల వల్లనే( దాయాది దేశం ఉక్రెయిన్ ను రష్యా కు శత్రుదేశంగా మార్చాయని..) ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని మండిపడ్డారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగిం చేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ(డర్టీ గేమ్)ఆడుతున్నాయంటూ . వాటి చర్య లకు తగిన ప్రతిఫలం అనుభవిస్తాయని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *