సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజగా హైదరాబాద్ లో తన నివాసం నుండి ట్విటర్ వేదికగా … వైసిపి ప్రభుత్వం ఫై మండిపడ్డారు. విశాఖ లో కొండలను మింగిన వైసీపీ అనకొండల బండారం బయట పడుతుందనే టీడీపీ పోరుబాటపై ఆంక్షలు విధించారని ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రకటించిందని, అయితే ప్రభుత్వం దీన్ని అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. కొండలను కూడా మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే తమ నేతల పోరుబాట అని స్పష్టం చేశారు. మహిళా నేతలను కూడా నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనమని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ పోరుబాటపై ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎవరు ఎంతగా అడ్డుకున్నా ’’సేవ్ ఉత్తరాంధ్ర’’ నినాదం ఆగదని తెలిపారు. . రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్‌‌పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతామని… ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తామని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *