సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మత్యపురి గ్రామంలో 1 కోటి 25 లక్షల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో త్రాగునీటి పథకం లో నిర్మించిన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ ను ప్రారంభించడానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అక్కడ మంత్రి బుగ్గన సమక్షంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నుద్దేశించి .. నేను 2015 లో ఇక్కడ మరో 6 గ్రామాలకు మంచినీటి కోసం ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్స్ నిర్మాణం కోసం కోటి పాతిక లక్షలు ఇచ్చానని, ఇప్పటికి వాటి నిర్మాణాలు పూర్తీ కాలేదని , స్థానిక ప్రజలు ఎమ్మెల్యేను ప్రశ్నించాలని ఒక్కసారిగా అనడంతో.. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి, మంత్రి బుగ్గన ఒక్కసారిగా ఇబ్బంది కి గురిఅయ్యారు. అయితే ఆమె కేంద్ర నుండి రాష్ట్రానికి నిధులు ఇచ్చే కీలకమైన ఆర్ధిక శాఖ మంత్రి కావడం తో ఆమెకు సమాధానం చెప్పకుండానే నవ్వుతో సరిపెట్టారు. ఇది మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై భీమవరం మండల ఎంపిపి, పేరిచర్ల నరసింహరాజు మీడియా తో మాట్లాడుతూ..మనప్రాంత వాసిగా మంత్రి నిర్మల సీతారామన్ అంటే గౌరవం ఉంది. ఆమె 2015లో కూడా 1 కోటి 25 లక్షల రూ 6గ్రామాలకు కలపి మంచినీటి గ్రావిటీ ఫిల్టర్స్ కోసం నిధులు ఇచ్చింది. బీజేపీ మద్దతు తో ఉన్న తెలుగు దేశం ఎమ్మెల్యే కు.. (గ్రంధి శ్రీనివాస్ అప్పుడు ఎమ్మెల్యే కాదు..) పైగా 2016 లో ఆమె ఇచ్చిన నిధులతో ఒక గ్రామంలో మాత్రమే గ్రావిటీ ఫిల్టర్స్ చేసారు. మిగతా గ్రామాలకు చెయ్యాలంటే 11 కోట్లు కావాలి. ఆమెను అప్పటి బీజేపీ టీడీపీ నేతలు మిగతా గ్రామాలకు సొమ్ము అడిగి ఉండవలసింది. కానీ అడగలేదు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన మీరు .. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనులలో వాస్తవాలు తెలుసుకొని మాట్లాడి ఉంటే మేము సంతోషించేవారము. తమరిని కొంతమంది తప్పు దోవ పట్టించారని మేము విశ్వసిస్తున్నాము.అందుకే మా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పై మీరు అనుచితంగా మాట్లాడారని మేము భావిస్తున్నాము అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *