సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లిగూడెం లో నేడు, శుక్రవారం నల్లజర్ల రోడ్ లో గల మాగంటి కళ్యాణ మండపములో ప్రతిష్టాత్మకముగ నిర్వహిస్తున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ విసృత్రస్దాయి సమావేశాన్నికి విశేషంగా పార్టీ క్యాడర్ తరలి వచ్చింది.ఈ సమావేశానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం అధ్యక్షరాలుగా, మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి వ్యవహరించారు. తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ చార్జీ వలవల బాబ్జీ పర్యవేక్షణలో ప్రారంభించారు. రాష్ట్ర పార్టీ నుండి మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లి రవీంద్ర, గద్దే రామ్మోహన్, పార్టీ కార్వాహక కార్యదర్శి మెంటే పార్ధసారధి, జిల్లా తెలుగురైతు అడ్జక్షులు పొత్తూరి రామ్ ప్రసాద్ చౌదరి తో బాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నుండి తెలుగుదేశం పార్టీ భాద్యతలు చూస్తున్న ఇన్ చార్జీలు, ఉండి , పాలకొల్లు ఎమ్మెల్యేలు ,శాసన మండలి సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు విశేషముగా హాజరు అయ్యారు. 2024 నాటి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ను తిరిగి సీఎం చేసే దిశగా పార్టీ క్యాడర్అడుగులు పడాలని, ప్రజలలో వైసిపి సర్కార్ ఫై ఉన్న వ్యతిరేకతను సమర్ధవంతంగా టీడీపీ కి అనుకూలంగా మార్చుకోవాలని , ప్రజా సమస్యలపై పోరాటాలు ఉదృతం చెయ్యాలని.. మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు సంక్షేమ పధకాల పట్ల భోరోసా ఇవ్వాలని వక్తలు ప్రసంగింస్తూన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *