సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో సినీ ప్రియులకు కేవలం 100 రూపాయలు లోపేటికెట్ ధరలకే ఇప్పటి వరకు దొరుకుతున్న కొత్త సినిమా వినోదానికి ఇక బ్రేక్ పడనుంది. గతంలో సినిమా టికెట్ ధరలు తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. అసలు సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ, కొందరు సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టులో పిటీషన్ వేశారు. నేడు, మంగళవారం పిటీషనర్ల తరఫున న్యాయవాదులు చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.35ను సస్పెండ్ చేసింది. దీంతో ఇక నుంచి రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వస్తాయి. దీనితో డిసెంబర్ నుండి సంక్రాంతి వరకు రిలీజ్ అవుతున్న పుష్ప, ఆర్ ఆర్ ఆర్, బీమ్లా నాయక్, రాధే శ్యాం వంటి భారీ సినిమాలకు మరల ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా పెరిగిపోయే టికెట్స్ రేట్లతో, వేల రూపాయల ధరలతో బెనిఫిట్ షోలతో కాసుల వర్షం కురవనుంది. మరల ఏపీ ప్రభుత్వం తాజా హైకోర్టు తీర్పు ఫై ఎలా స్వాందిస్తుందో ?,మరోసారి ఆపిల్ కి వెళుతుందో? ఫై బెంచ్ కు వెళుతుందో ?వేచిచూడాలి
