సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం తాడేరు వంతెన నిర్మాణం ఇంకెంతా కాలం చేస్తారని, అధికారుల నిర్లక్ష్యం వల్లే 15 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు (చినబాబు) అన్నారు. నేడు,మంగళవారం భీమవరం మండలం కరుకువాడ బేతాపూడి నుంచి భీమవరం వరకు జనసేన చలో పాదయాత్ర నిర్వహించారు. చినబాబు మాట్లాడుతూ భీమవరం నుండి నరసాపురం వెళ్ళే ప్రధాన రహదారిలో తాడేరు గ్రామంలో వంతెన శిధిలావస్థకు రావడం వల్ల అధికారులు వాహన రాకపోకలు నిలిపివేసి రెండు సంవత్సరాలు కావొస్తుందని, ఈ వంతెన దిగువభాగాన సుమారు 15 గ్రామాలలో 40 వేలకు పైగా జనాభా ఉన్నారని, 2 ఏళ్ల నుండి ఆర్టీసి బస్సులు రాకపోకలు లేవని,అత్యవసర పరిస్థితులలో 108,అగ్నిమాపక వాహనం వెళ్ళే సౌకర్యం లేదని, దయచేసి అధికార యంత్రాంగం వంతెన నిర్మించాలని కోరుతున్నామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయన ఇంటి చుట్టు రోడ్లకు సుమారు 60లక్షలతో టెండర్లు వేస్తారు, తాడేరు బ్రిడ్జి నిర్మాణానికి మాత్రం టెండర్లు వెయ్యరు అని ఆరోపించారు. ప్రజలు 2 ఏళ్ల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, సుమారు 40 కిమీ చుట్టు తిరిగి రావలసి వస్తుందని అన్నారు. అధికార యంత్రాంగం నిద్రలేచి త్వరగా వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్ అండ్ బి అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో నరసాపురం పార్టీ ఇన్ ఛార్జ్ బొమ్మిడి నాయకర్, రాష్ట్ర PAC సభ్యులు వేగేశ్న కనకరాజు సూరి,,పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి , పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్రశేఖర్, స్టేట్ సెక్రటరీ శాంతి ప్రియ, Ztpc గుండా జయప్రకాష్, ఎంపిటిసి ప్రకాశం,గుల్లిపల్లి విజయలక్ష్మీ,అరేటి వాసు, రాష్ట్ర నాయకులు మల్లీనిడి తిరుమల రావు, బండి రమేష్ నాయుడు, మాజీ కౌన్సిలర్స్ వానపల్లి సూరిబాబు , మాగాపూ ప్రసాద్, అతికల అంజనేయ ప్రసాద్, మరియు నియోజకవర్గ ఎంపీటీసీలు, గ్రామ ప్రెసిడెంట్ లు, వీర మహిళలు, జనసైనికులు, పాల్గొన్నారు..
