సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డి.ఎన్.ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు, బుధవారం నవంబర్ 2 వ తేదీన ఐ.ఇ.టి.ఇ (ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ ) పౌండేషన్ డే ని పురస్కరించుకొని … ఆప్టికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ దాని ఆవశ్యకత, పనిచేయు విధానం అనే అంశం పై సెమినార్ నిర్వహించామని కళాశాల సెక్రటరీ అండ్ కార్సపాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు (బాబు) తెలిపారు. ఈ సెమినార్ లో భీమవరం BSNL(భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) టెంకామ్ సర్కిల్ సబ్ డివిజనల్ ఇంజినీర్, మిడిసాల రాకేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆప్టికల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్స్ వర్కింగ్ మరియు నిర్మాణం ఇంజినీరింగ్ విద్యలో ఏవిధంగా ఉపయోగపడుతుందో దాని యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు. ఎన్నో వినూత్నమైన, విశ్లేషణత్మక అంశాలను గూర్చి చర్చించారు. ఈ సెమినార్లో కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్. ఎమ్ అంజన్ కుమార్, డీన్ అకాడమిక్స్ డాక్టర్. ఎన్. వెంకట్రావు, ఈ. సి. ఈ విభాగధిపతి డాక్టర్ ఎ.పి. రమేష్ పాల్గొని, ఇంజనీరింగ్ విద్యలో ఆప్టికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషనన్ను విద్యార్థులకు తెలియపరిచారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొన్నారు
