సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేడు, గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. బీజేపీ, ప్రాంతీయ పార్టీల మధ్య హోరాహోరీగా సాగుతున్న పోరు ప్రతిష్ఠాత్మకంగా మారింది. నేడు, గురువారం నాటి ఉపఎన్నికల పోలింగ్ పర్వంలో తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పర్వంలో పార్టీల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికల పర్వంలో నగదు పంపిణీ జోరుగా సాగింది. మునుగోడు పోలింగ్ బీజేపీకి, టీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా,వారి భవిశ్యత్తుకు నిర్ణయాత్మకంగా మారింది. ఉదయం 11 గంటల వరకూ 25.80 శాతం పోలింగ్ నమోదయినట్లు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అయితే గతంలో 91 శాతం ఓటింగ్ నమోదు అయిన మునుగోడు లో ఈ సారి అంతవరకూ వస్తుందంటే అనుమానమే.. ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుకు గుడ్ బై చెప్పి మహా కూటమిలో చేరిన తర్వాత మొదటిసారి ఉప ఎన్నిక జరుగుతోంది. మొకామా, గోపాల్ గంజ్ అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది. హర్యానాలోని అడంపూర్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోరఖ్‌నాథ్ ఉపఎన్నికలో తన సీటును నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. మహారాష్ట్రలో శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ముంబైలోని అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాన్నితిరిగి కైవసం చేసుకునేందుకు యత్నిస్తోంది. బీజేపీ పోటీ నుంచి వైదొలగడంతో శివసేన మంచి పోటీ ఇస్తుంది.
